![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -153 లో.....అందరు టిఫిన్ చేస్తుంటారు. అవును ధన ఎక్కడ అని సీతాకాంత్ సిరిని అడుగుతాడు. బిజినెస్ ప్లాన్ మీద ముంబై వెళ్ళాడని సిరి చెప్పగానే.. అక్కడ ఏదైనా అవసరం అయితే చెప్పమను.. తెలిసిన వాళ్ళున్నారని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి తినకుండా ఆలోచిస్తుంటే.. ఏం ఆలోచిస్తున్నావని సీతాకాంత్ అడుగుతాడు. ఇక సీతాకాంత్ దృష్టిలో మంచి ఇంప్రెషన్ కొట్టేయడానికి శ్రీలత నటిస్తుంది. సారి రామలక్ష్మి నువ్వు జాబ్ , నా వల్లే వదులుకున్నావని శ్రీలత అంటుంది. అయ్యో అమ్మా అలా అనకని సీతాకాంత్ అంటాడు.
రామలక్ష్మి ఆ జాబ్ పోతే ఏంటి ఆఫీస్ లో ఇంకొక జాబ్ ఇవ్వమని శ్రీలత అంటుంది. అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఇవ్వు జనరల్ మేనేజర్ కి హెల్ప్ గా ఉంటుందని శ్రీలత అంటుంది. మంచి ఛాన్స్ ఒప్పుకోరా అని పెద్దాయన అంటాడు. అంటే తనకి ఇష్టముందో లేదోనని సీతాకాంత్ అనగానే.. నాకు ఇష్టమేనని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత చూసావా నువ్వు ఎప్పుడు నా కాళ్ళ దగ్గర ఉండాలని అలా చేశానని శ్రీలత అంటుంది. నా కొడుకు కింద పని చేస్తావన్నట్లు శ్రీలత పొగరుగా మాట్లాడుతుంది. ఇక నీ భర్త కని ఎక్కడికి తీసుకొని వెళ్తానో చూడమని శ్రీలత అనగానే.. చాలా థాంక్స్ అత్తయ్య.. నా భర్త పక్కనే ఉండేలా చేసావ్.. అంతే కాకుండా ఆఫీస్ లో ఎప్పుడు ఉంటే.. అక్కడ ఏం జరుగుతుందో అన్ని తెలుస్తుంది.. అంతకు మించి మేమ్ ఆఫీస్ కి వెళ్లి రావొచ్చని శ్రీలతతో రామలక్ష్మి మాట్లాడుతుంది.
కాసేపటికి రామలక్ష్మి మాటలకి శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్తున్నానని సీతాకాంత్ అనగానే.. సరే వెళ్ళండి అని రామలక్ష్మి అంటుంది. అదేంటీ తను కూడా వస్తాననట్లేదని అలాగే రెండు మూడు సార్లు వెళ్తున్నా అన్నా కూడా.. రామలక్ష్మి వెళ్ళండి అని చెప్తుంది. అంటే నువ్వు రావా అని సీతాకాంత్ అంటాడు. లేదు చైర్మన్ తో కలిసి రావడమా అని రామలక్ష్మి అనగానే.. నాకు అలాంటివేం లెవ్వు.. నా డ్రైవర్ ని పెళ్లి చేసుకొని అంతకంటే పెద్ద పోస్ట్ భార్య పోస్ట్ ఇచ్చానని సీతకాంత్ అనగానే.. రామలక్ష్మి నవ్వుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |